కడప ఎంపీ జగన్మోహనరెడ్డి గోదావరి తీరం నుంచి కాంగ్రెస్ అధిష్ఠానానికి గట్టి సవాల్ విసిరారు. తన సహనం ఎంత కాలం ఉంటుందో తెలియదని ప్రకటించడం ద్వారా తన భవిష్యత్ కార్యాచరణను చెప్పకనే చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి రెండోదశ అనుమతి రావడంతో అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వూపిరి పీల్చుకొన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రోజు తిరగక ముందే కేంద్రం కొత్త కొర్రీలు వేసింది.
గోదావరిపై మహారాష్ట్ర సర్కారు చేపట్టిన బాబ్లీ ఆనకట్ట అక్రమ నిర్మాణంపై కేంద్రంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. వివాద పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని ప్రధాని నిర్ణయించారు.